న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రాజెక్ట్ వాటర్ వర్త్ పేరుతో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థతో భారత్‌ను అనుసంధానించనున్నట్టు మెటా సంస్థ శనివారం ప్రకటించింది. ఈ భారీ ప్రాజెక్టు ఈ దశాబ్దం ముగింపు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
భూమి చుట్టుకొలత కన్నా పెద్దగా 50,000 కిలోమీటర్లకు పైగా పొడవైన ప్రాజెక్టు వాటర్వర్త్ ఐదు ప్రధాన ఖండాలను కలుపుతుందని ప్రకటించింది. టెలికం ఆపరేటర్లు ఈ కేబుల్స్‌తో అనుసంధానమై వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని సమకూరుస్తారు.