Bhargavastra | డ్రోన్ దాడులకు కౌంటర్‌గా.. భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించిన భారత్
Bhargavastra | సోలార్ డిఫెన్స్, ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్ (counter swarm drone system) ‘భార్గవాస్త్ర’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది.
Bhargavastra | ఆపరేషన్ సిందూర్ సమయంలో పొరుగు దేశం పాకిస్థాన్ ఎక్కువగా డ్రోన్లతో దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ (counter swarm drone system) ‘భార్గవాస్త్ర’ (Bhargavastra)ను సిద్ధం చేసింది.
సోలార్ డిఫెన్స్, ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్‌ను భారత్ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని గోపాల్పూర్ (Gopalpur)లో గల సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ (Seaward Firing Range) నుంచి పరీక్షించింది. మూడుసార్లు పరీక్షించగా.. భార్గవాస్త్ర రాకెట్ టార్గెట్‌ను కచ్చితత్వంతో హిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భార్గవాస్త్ర డ్రోన్ సమూహాల ముప్పును ఎదుర్కోవడంలో చాలా కీలకం.
#WATCH | A new low-cost Counter Drone System in Hard Kill mode ‘Bhargavastra’, has been designed and developed by Solar Defence and Aerospace Limited (SDAL), signifying a substantial leap in countering the escalating threat of drone swarms. The micro rockets used in this… pic.twitter.com/qM4FWtEF43
— ANI (@ANI) May 14, 2025
భార్గవాస్త్ర అనేది ఒక కౌంటర్ డ్రోన్ వ్యవస్థ (counter drone system). డ్రోన్ దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలదు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న వైమానిక వాహనాలను కూడా ఇది గుర్తించి, గైడెడ్ మైక్రో బాంబులను ఉపయోగించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. భార్గవాస్త్ర వ్యవస్థకు ఏకకాలంలో 64 మైక్రో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఎక్కడికైనా సులువుగా, వేగంగా తరలించవచ్చు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ఇది.
Also Read..
Turkey | ఆపరేషన్ సిందూర్ సమయంలో.. పాక్‌కు 350కిపైగా డ్రోన్లు, సైనిక సిబ్బందిని పంపిన తుర్కియే
Union Cabinet: 3706 కోట్లతో సెమీకండక్టర్ యూనిట్.. ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

