IND vs PAK | అందుకే ఆ ఒప్పందాన్ని రద్దుచేశాం.. పాకిస్థాన్‌పై భారత్ మండిపాటు
IND vs PAK | ఐక్యరాజ్యసమితి (UNO) లో పాకిస్థాన్ (Pakistan) వైఖరిని భారత్ (India) మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని మండిపడింది.
IND vs PAK : ఐక్యరాజ్యసమితి (UNO) లో పాకిస్థాన్ (Pakistan) వైఖరిని భారత్ (India) మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) ఘాటుగా స్పందించారు.
సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్, జమ్ముకశ్మీర్, సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని శిక్షిస్తూ సరికొత్త సాధారణ స్థితి నెలకొల్పినట్లు భారత్ చెబుతున్న పరిస్థితి ఏమీ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తమ ప్రతిస్పందనతోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు.
దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఘాటుగా స్పందించారు. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్థాన్ ప్రతిసారీ భారత్‌కు, దేశ ప్రజలకు హాని కలిగించడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని హరీశ్ పునరుద్ఘాటించారు.
భారత అంతర్గత అంశాలపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్థాన్‌కు లేదన్నారు. 65 ఏళ్ల క్రితం విశ్వాసం, స్నేహం స్ఫూర్తితో భారత్ సింధూ జలాల ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు. అందుకే భారత్ ఆ ఒప్పందాన్ని నిలిపివేసిందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

