ఆయుధాల దిగుమతిలో భారత్ నెంబర్ 2.. ఫస్ట్ ఏ దేశమంటే..
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ టాప్‌లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల ఉక్రెయిన్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2015-19తో పోలిస్తే 2020-24 మధ్య ఆ దేశ దిగుమతులు 100 రెట్లు పెరగడం గమనార్హం. అదే సమయంలో ఉక్రెయిన్ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది.
ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ టాప్‌లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల ఉక్రెయిన్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2015-19తో పోలిస్తే 2020-24 మధ్య ఆ దేశ దిగుమతులు 100 రెట్లు పెరగడం గమనార్హం. అదే సమయంలో ఉక్రెయిన్ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది. భారత్ దిగుమతులు 9.3 శాతం తగ్గినప్పటికీ ద్వితీయ స్థానంలో నిలిచింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ఈ వివరాలు తెలిపింది.
టాప్ దిగుమతిదారులు ప్రపంచ దిగుమతుల్లో వాటా
- ఉక్రెయిన్-8.8%
- భారత్-8.3%
- కతార్-6.8%
- సౌదీ అరేబియా-6.8%
- పాకిస్థాన్-4.6%
- జపాన్-3.9%
టాప్ ఎగుమతిదారులు- ప్రపంచ ఎగుమతుల్లో వాటా
- అమెరికా -43%
- ఫ్రాన్స్- 9.6%
- రష్యా -7.8%
- చైనా -5.9%
- జర్మనీ-5.6%
- ఇటలీ-4.8%
ఉక్రెయిన్‌కు సుమారు 35 దేశాలు ఆయుధాలను ఎగుమతి చేశాయి ఉక్రెయిన్ దిగుమతులు ఇలా..
- అమెరికా- 45%
- జర్మనీ- 12%
- పోలండ్- 11%
భారత్ దిగుమతులు ఇలా..
- రష్యా (38%)
- ఫ్రాన్స్ (28 %)
- అమెరికా ఎగుమతులు 21 శాతం పెరిగాయి. ఆ దేశం ఉక్రెయిన్ సహా 107 దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసింది.
- రష్యా ఎగుమతుల్లో 64 శాతం క్షీణత నమోదైంది.
- 1990-94 తర్వాత మొదటిసారి చైనా టాప్-10 దిగుమతిదారుల లిస్ట్‌లో చోటు దక్కలేదు.
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నాటో దిగుమతులు 155 శాతం పెరిగాయి.
- ప్రపంచవ్యాప్తంగా 2010-14 నుంచి 2015-19 మధ్యకాలంతో పోలిస్తే ఆయుధాల వ్యాపారం స్థిరంగానే ఉంది. అయితే, 2005-09తో పోలిస్తే 18 శాతం పెరుగుదల నమోదైంది.
- పాకిస్థాన్ దిగుమతులు 61 శాతం పెరిగాయి. 81 శాతంతో చైనా ఆ దేశపు అతిపెద్ద సప్లయర్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

