న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ(Fastest Growing Economy) భారత్ అని ఐక్యరాజ్యసమితి తన ఆర్థిక రిపోర్టులో పేర్కొన్నది. భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ తన రిపోర్టులో తెలిపింది. 2024లో భారత ఆర్థిక వృద్ధి 6.2 అని పేర్కొన్నా.. అది అంచనా వేసిన 6.3 శాతం కన్నా స్వల్పంగా తక్కువగా ఉంటుందని యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది. ఉత్పత్తి, సర్వీసెస్ రంగంలో బలమైన వృద్ధి కారణంగా భారత ఆర్థిక వృద్ధి బాగుంటుందని యూఎన్ రిపోర్టు తెలిపింది.
గత ఏడాది భారత్లో అధిక స్థాయిలో పెట్టుబడులు నమోదు అయినట్లు యూఎన్ తన రిపోర్టులో చెప్పింది. ప్రభుత్వ మౌళికసదుపాయాల ప్రాజెక్టులు, బహుళజాతి కంపెనీల పెట్టుబడుల ఘననీయంగా పెరిగినట్లు అంచనా వేశారు. 2023లో మూడవ త్రైమాసికంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో ఉత్పత్తి, కొనుగోలు రంగం మెరుగైన ప్రదర్శన ఇచ్చిందని యూఎన్ తన రిపోర్టులో పేర్కొన్నది.