దేశంలో రెండేండ్ల తర్వాత వెయ్యిలోపు కరోనా కేసులు
corona cases | దేశంలో కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా ఆదివారం నాటికంటే 16 శాతం తక్కువ అని వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితులు 4,30,29,044కు చేరారు.
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా ఆదివారం నాటికంటే 16 శాతం తక్కువ అని వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితులు 4,30,29,044కు చేరారు. ఇందులో 4,24,95,089 మంది బాధితులు కోలుకోగా, 5,21,358 మంది మృతిచెందారు. మరో 12,597 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా, యాక్టివ్ కేసులు 13 వేల దిగువకు చేరడం గత 714 రోజుల్లో ఇదే తొలిసారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 13 మంది వైరస్‌కు బలవగా, 1316 మంది కోలుకున్నారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉందని, యాక్టివ్ కేసులు 0.03 శాతం, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,84,70,83,279 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

