బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 15, 2020 , 01:46:46

భారత్‌, పోర్చుగల్‌ మధ్య ఏడు ఒప్పందాలు

భారత్‌, పోర్చుగల్‌ మధ్య ఏడు ఒప్పందాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన పోర్చుగల్‌ అధ్యక్షుడు మర్సెలో రెబెలో డిసూజాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అనంతరం భారత్‌, పోర్చుగల్‌ మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. పెట్టుబడులు, రవాణా, పోర్టులు, సాంస్కృతిక రంగం, పరిశ్రమలు, మేధో సంపత్తి హక్కుల విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 2017లో పోర్చుగల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ అప్పట్లో ఆ దేశంతో 11 ఒప్పందాలు చేసుకున్నారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. అధికారులు మాట్లాడుతూ భారత్‌, పోర్చుగల్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, విద్య తదితర కీలక అంశాలపై విసృత్తంగా చర్చలు జరిగాయని చెప్పారు. ఈ నాలుగు రోజుల్లో సౌసా మహారాష్ట్ర, గోవాలోనూ పర్యటించనున్నారు.logo