కరోనాతో భారత్‌లో 47 లక్షల మరణాలు… WHO రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం
న్యూఢిల్లీ: రెండేళ్లలో 47 లక్షల కరోనా మరణాలు భారత్‌లో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు భారత్‌లో లక్షలాది మంది కరోనా వల్ల చనిపోయినట్లు ఆ సంస్థ నివేదిక పేర్కొంది. కాగా, ఈ కాలంలో దేశంలో సుమారు 5,20,000 కరోనా మరణాలు నమోదైనట్లు అధికార గణాంకాల ప్రకారం తెలుస్తున్నది. అయితే ప్రపంచవ్యాప్త కరోనా మరణాల్లో మూడో వంతు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు పది రెట్ల మేర ఇది ఉన్నది. అలాగే అధికార లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. అయితే ఈ సంఖ్యకు రెట్టింపులో ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది వైరస్ వల్ల చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో వెల్లడించింది.
కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ గణిత నమూనా ప్రకారం ఈ లెక్కలు వేశారని ప్రశ్నించింది. ఈ సంఖ్యకు వాస్తవ సంఖ్యకు చాలా తేడా ఉన్నదని తెలిపింది. దేశంలో జనన, మరణాల నమోదుకు అత్యంత బలమైన వ్యవస్థ ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో డేటా సేకరణ వ్యవస్థను ప్రశ్నించింది. అసంబద్ధంగా ఉన్న ఈ గణాంకాల శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid deaths
- WHO Report
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

