Sarad pawar| ప్రధాని మోదీతో వేదిక పంచుకోనున్న శరద్ పవార్.. ఇండియా కూటమి నేతల అసంతృప్తి
ముంబై: వచ్చే నెల 1న పుణేలో నిర్వహించనున్న ప్రధాని మోదీ సన్మాన కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Sarad pawar| ముంబై: వచ్చే నెలలో ముంబైలో ఇండియా కూటమి నేతల మూడో సమావేశం జరుగనున్నది. ఈ క్రమంలో వచ్చే నెల 1న పుణేలో జరిగే కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్రమోదీతో వేదిక పంచుకోనుండటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానికి లోకమాన్య తిలక్ అవార్డు ప్రదానం చేసే కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శుక్రవారం నిర్వహించిన ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశంలో కొందరు సభ్యులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పవార్‌తో మాట్లాడి ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా చూడాలని వారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరినట్టు సమాచారం. ఈస్టిండియా కంపెనీ, ఇండియా ముజాహిదీన్ అంటూ ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీతో శరద్ పవార్ వేదిక పంచుకుంటే తప్పుడు సందేశం పంపినట్టు అవుతుందని వారు అభిప్రాయపడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటికి వస్తున్న క్రమంలో.. మోదీ సన్మాన కార్యక్రమానికి పవార్ హాజరుకావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇండియా కూటమిలో పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- lokamanya tilak
- Pm Modi
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

