మంగళవారం 07 జూలై 2020
National - Apr 21, 2020 , 13:34:22

భార‌త‌దేశం మైనారిటీలు, ముస్లింల‌కు స్వ‌ర్గం: న‌ఖ్వీ

భార‌త‌దేశం మైనారిటీలు, ముస్లింల‌కు స్వ‌ర్గం: న‌ఖ్వీ

న్యూఢిల్లీ: భార‌త‌దేశం మైనారిటీలు, ముస్లింల‌కు స్వ‌ర్గమ‌ని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ అభివ‌ర్ణించారు. భార‌త్‌లో ప‌క్ష‌పాత వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌ని ఆరోపించే కొంత‌మంది దేశం మూలాల‌ను తెలుసుకుని మాట్లాడాల‌ని న‌ఖ్వీ వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఎంపీ స‌లావుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి న‌ఖ్వీ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలిసింది. ఇదిలావుంటే, లాక్‌డౌన్ నేప‌థ్యంలో రంజాన్ ప్రార్థ‌న‌ల‌ను ఇండ్ల‌లోనే చేసుకోవాల‌ని ముస్లిం మ‌త‌పెద్ద‌లు ప్ర‌జ‌ల‌కు సూచించార‌ని న‌ఖ్వీ తెలిపారు. వారే స్వ‌యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం వారు తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని కేంద్ర‌ ప్ర‌భుత్వం స్వాగ‌తిస్తున్న‌ద‌ని న‌ఖ్వీ పేర్కొన్నారు.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo