ప్రపంచ ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్.. మనకంటే మెరుగ్గా నేపాల్.!
Global Hunger Index-2022: దేశంలో ఆకలికేకలు ఏటికేడు పెరుగుతున్నాయనీ, పోషకాహార లోపం తీవ్రమవుతుందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక
Global Hunger Index-2022: దేశంలో ఆకలికేకలు ఏటికేడు పెరుగుతున్నాయనీ, పోషకాహార లోపం తీవ్రమవుతుందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక-2022 ద్వారా స్పష్టమైంది. ఎందుకంటే ఈ ఏడాది గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింత దిగజారింది. 2021లో 101వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 107వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆకలి స్థాయిలు, పోషకాహార లోపం ఆధారంగా ప్రతి ఏడాది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను వెల్లడిస్తారు. 2022కు సంబంధించి శనివారం విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107వ స్థానానికి పరిమితమైంది. గత ఏడాది 116 దేశాల్లో 101వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి 121 దేశాల జాబితాలో 107వ స్థానంలో నిలిచింది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మన్ ఆర్గనైజేషన్ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా రూపొందించిన ఈ హంగర్ ఇండెక్స్.. భారత్‌లో ఆకలి స్థాయి తీవ్రమైందని పేర్కొంది.
పొరుగు దేశాలైన పాకిస్తాన్ 99వ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 84వ, నేపాల్ 81వ స్థానాల్లో భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇక బెలారస్, హంగరీ, చైనా, టర్కీ, కువైట్‌తో సహా 17 దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భారత గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ కూడా 2000లో 38.8 నుంచి 2014 -2022 సంవత్సరాల మధ్య 28.2- 29.1 శ్రేణికి పడిపోయింది. ఈ ఏడాది సూచీలో భారత్ కంటే వెనుకబడిన ఏకైక ఆసియా దేశంగా ఆఫ్ఘనిస్తాన్ (109) మాత్రమే నిలిచింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు వైఫల్యంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

