న్యూఢిల్లీ : భారత్ శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రెడెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణి ‘అగ్ని-1’ను విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. ‘ఈ పరీక్షను స్ట్రాటజిక్ షోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించారు’ అని వెల్లడించింది.
అగ్ని-1 నుంచి 4 క్షిపణులు 700 కిలోమీటర్ల నుంచి 3,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటిని ఇప్పటికే సైన్యంలో మోహరించారు.