2.12 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోళ్లు
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో దేశ రక్షణ రంగ బలోపేతం కోసం రూ. 2.12 లక్షల కోట్ల విలువైన సైనిక హార్డ్‌వేర్ కొనుగోళ్లకు అధికారికంగా ఆమోదం లభించింది.
న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో దేశ రక్షణ రంగ బలోపేతం కోసం రూ. 2.12 లక్షల కోట్ల విలువైన సైనిక హార్డ్‌వేర్ కొనుగోళ్లకు అధికారికంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా త్రివిధ దళాల అవసరాలకు తగినట్లుగా అత్యాధునిక ఆయుధాలు, సైనిక ప్లాట్‌ఫామ్‌లు సమకూర్చనున్నారు. ఈ మొత్తం కొనుగోళ్లలో సుమారు 82 శాతం దేశీయ పరిశ్రమల నుంచి సేకరించనున్నారు.
ఈ ప్రతిపాదనల ప్రకారం భారత సైన్యం కోసం లైట్ మల్టీ రోల్ హెలికాప్టర్లు, లాంగ్ రేంజ్ కామికాజ్ డ్రోన్స్ సిస్టమ్స్, హై మొబిలిటీ వెహికిల్స్ మొదలైనవి సమకూర్చనున్నారు. భారత నావికా దళం కోసం యాక్టివ్ ఆఫ్ బోర్డ్ డికాయ్ సిస్టమ్, భారత వాయుసేనకు నూతన హెలికాప్టర్లు కొనుగోలు చేయనున్నారు .
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

