సుప్రీంకు ఇండియా కూటమి మార్చ్
‘ఓట్ చోరీ’ ఆరోపణలపై వీధి నిరసనల అనంతరం విపక్ష ఇండియా కూటమి పార్టీలు సోమవారం దేశ రాజధానిలో తమ బలాన్ని మరోసారి ప్రదర్శించాయి. విపక్ష పార్టీలకు చెందిన అగ్రనాయకులు, వందలాది మంది మద్దతుదారులు సుప్రీంకోర్టు వరకు ‘ప్రజాస్వామ్య యాత్ర’ను చేపట్టారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు వ్యతిరేకంగా, ఎన్నికల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఒక సంయుక్త పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఇండియా కూటమి నాయకులు దాఖలు చేశారు.
- ఎన్నికల అవకతవకలపై పిటిషన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై వీధి నిరసనల అనంతరం విపక్ష ఇండియా కూటమి పార్టీలు సోమవారం దేశ రాజధానిలో తమ బలాన్ని మరోసారి ప్రదర్శించాయి. విపక్ష పార్టీలకు చెందిన అగ్రనాయకులు, వందలాది మంది మద్దతుదారులు సుప్రీంకోర్టు వరకు ‘ప్రజాస్వామ్య యాత్ర’ను చేపట్టారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు వ్యతిరేకంగా, ఎన్నికల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఒక సంయుక్త పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఇండియా కూటమి నాయకులు దాఖలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ప్రతిపక్షాలతో సమావేశం కావాలన్న అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ తిరస్కరించిన మరుసటి రోజున విపక్ష నాయకులు సుప్రీంకోర్టులో సంయుక్త పిటిషన్‌ను దాఖలు చేశారు. ఓట్ల చోరీకి అడ్డుకట్ట వేయడం, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, సర్ ప్రక్రియను నిలిపివేయడం, తిరిగి పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడం వంటి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీజేఐకి సమర్పించాలని అనుకుంటున్నట్టు విపక్ష నాయకులు తెలిపారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ, ఐఏఎస్ఏ అధినేత్రి నేహా బోరా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
టచ్‌లో 200 మంది ప్రభుత్వాధికారులు
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ సహా పలు విభాగాలకు చెందిన సుమారు 200 మంది అధికారులు ప్రతిపక్షంతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారాలని, నిజాలను బయటపెట్టాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

