Shraddha Walkar Murder Case | సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఈ హత్య కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకొచ్చాయి. తాజాగా ఈ కేసులో ఢిల్లీ పోలీసులకు బలమైన సాక్ష్యం(big evidence) లభించింది. శ్రద్దాతో ఆఫ్తాబ్ గొడవ పడిన ఆడియో క్లిప్ తాజాగా పోలీసులకు దొరికింది.
ఢిల్లీ కోర్టు ఆదేశాల తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫోరెన్సిక్ బృందం ఆఫ్తాబ్ వాయిస్ నమూనాను సోమవారం సేకరించింది. ఉదయం 10 గంటలకు సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో ఆఫ్తాబ్కు వాయిస్ శాంప్లింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ కేసులో తాజా పురోగతిని సాధించడానికి పోలీసు అధికారులు వాయిస్ నమూనాను కొత్తగా సేకరించిన ఆడియో క్లిప్‌తో సరిపోల్చుతారు.
సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా ఈ ఏడాది మే 18వ తేదీన దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను ఢిల్లీ పరిసరాల్లో పడేశాడు. నిందితుడు ఆఫ్తాబ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దారుణం గురించి అతడే వెల్లడించాడు. దీంతో ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు విచారణలో భాగంగా.. శ్రద్దాను తానే హత్య చేసినట్లు కోర్టు ముందు ఆఫ్తాబ్ అంగీకరించాడు.