తిరువనంతపురం: సుప్రీంకోర్టు స్పందన నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఒక బిల్లును ఆమోదించారు. మిగతా ఏడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వులో ఉంచారు. ఇటీవల పంజాబ్ వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు స్పందిస్తూ గవర్నర్లు బిల్లులను నిరవధికంగా తొక్కిపెట్టడం సరికాదని హితవు పలికిన విషయం తెలిసిందే.