Vande Bharat Train | వందే భారత్ రైలుపై రాళ్ల దాడి.. అద్దాలు ద్వంసం
Vande Bharat Train | వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది.
చండీగఢ్: వందే భారత్ రైలుపై (Vande Bharat Train) కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఫగ్వారా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. దీంతో సీ 3 కోచ్‌లోని రెండు విండో గ్లాస్లు పగుళ్లిచ్చాయి. పెద్ద శబ్దానికి అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికీ ఏమీ జరుగకపోవడంతో ఊరట చెందారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న వందే భారత్ రైలు సిబ్బంది ఆ కోచ్ వద్దకు చేరుకున్నారు. రాళ్ల దాడిలో ధ్వంసమైన కిటికీ అద్దాలను పరిశీలించారు. కొందరు పిల్లలు రాళ్లు విసిరినట్లు ప్రయాణికులు ఆరోపించారు. అయితే ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరుగడం ఇదే తొలిసారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

