భోపాల్: మహిళా వైద్యురాలిని (Female doctor) ఒక వ్యక్తి వేధించాడు. ఆమెపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిని తన గ్యాంగ్‌తో కలిసి కొట్టాడు. ఈ సంఘటనపై స్థానికులు నిరసనకు దిగారు. నిందితుడిపై చర్యలకు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జాయినీలో ఈ సంఘటన జరిగింది. ఫిజియోథెరపిస్ట్ జరీన్ శుక్రవారం తన స్కూటీపై వెళ్తున్నది. ఖరాకు ప్రాంతంలో హితేష్ బద్వాయా అనే వ్యక్తి ఆమెను అడ్డుకున్నాడు. స్కూటీని ఆపి తాళం తీసుకున్నాడు. జరీన్‌ను వేధింపులకు గురి చేశాడు. ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడు.
కాగా, అటుగా వెళ్తున్న తెలిసిన వ్యక్తి తౌఫీక్ ఖాన్ సహాయాన్ని వైద్యురాలు జరీన్ కోరింది. దీంతో అతడు జోక్యం చేసుకున్నాడు. ఆమెను వదిలిపెట్టాలని చెప్పాడు. అయితే హితేష్ ఫోన్ చేసి తన గ్యాంగ్‌ను రప్పించాడు. వారంతా కలిసి తౌఫీక్ ఖాన్‌ను కొట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక కాంగ్రెస్ నేతల నేతృత్వంలో స్థానికులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడి ఇంటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. దీంతో స్థానికులు నిరసన విరమించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యురాలు జరీన్‌ను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
शिवराज में असुरक्षित बेटियाँ,
―उज्जैन में घर लौट रही फिजियोथेरेपिस्ट डॉक्टर से गुंडों ने छेड़खानी और मारपीट की।अपराधियों को गिरफ़्तार करने एवं न्याय की माँग को लेकर कांग्रेस नेत्री नूरी खान ने एसपी कार्यालय का घेराव किया।
शिवराज जी,
मप्र में बेटियाँ कब सुरक्षित होंगी❓… pic.twitter.com/igA5vgLINo— MP Congress (@INCMP) July 29, 2023