Hardeep Nijjar | ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ను అందుకే చంపేశాం : గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్
Hardeep Nijjar | ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజ్జర్‌ను తామే చంపినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ (Goldy Brar) తెలిపాడు. ఈ విషయం ఓ ఆడియో లీక్ ద్వారా వెల్లడైంది. యూకేలోని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalisthani Terrorist) పరమ్‌జిత్ సింగ్ పమ్మా, గోల్డీ బ్రార్ మధ్య జరిగిన సంభాషణలో ఈ విషయం వెలుగుచూసింది.
Hardeep Nijjar : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజ్జర్‌ను తామే చంపినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ (Goldy Brar) తెలిపాడు. ఈ విషయం ఓ ఆడియో లీక్ ద్వారా వెల్లడైంది. యూకేలోని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalisthani Terrorist) పరమ్‌జిత్ సింగ్ పమ్మా, గోల్డీ బ్రార్ మధ్య జరిగిన సంభాషణలో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆడియాలో బ్రార్ మాట్లాడుతూ.. తమ టీమ్ నిజ్జర్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందో పేర్కొన్నాడు.
నిజ్జర్ డ్రగ్ నెట్‌వర్క్‌లో పాల్గొన్న వారికి మద్దతు ఇస్తూ.. తన సొంత ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నట్లు బ్రార్ ఆరోపించాడు. నిజ్జర్ అక్రమ ఆయుధాల వ్యాపారంలో ఉన్నాడని, అతడిని చంపడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాడు. ప్రతి ఒక్కరూ తాము చేసిన పనులకు పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని బ్రార్ చివరగా అన్నాడు. మరోవైపు నిజ్జర్ హత్యపై గోల్డీబ్రార్‌పై అమెరికాలో ఇప్పటికే కేసు నమోదైంది. నిజ్జర్‌ను హత్య చేయాలని బ్రార్ నుంచి ఆదేశాలు అందాయని అమెరికా దర్యాప్తు అధికారులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అనంతరం ఈ కేసులో భారత అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని కెనడా పోలీసులు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
KTR | దిగులుపడొద్దమ్మా.. బాగా చదువుకో.. నిరుపేద ఆదివాసీ బిడ్డకు కేటీఆర్ భరోసా!
Firefighters | ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష.. హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

