Burnt Alive | చెట్టును ఢీకొన్న కారు.. కొత్త దంపతులతో సహా నలుగురు సజీవ దహనం
Burnt Alive | ఒక కారు చెట్టును ఢీకొన్నది (Car Crash). ఆ కారులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణించిన కొత్త దంపతులతో సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు ( Burnt Alive).
భోపాల్: ఒక కారు చెట్టును ఢీకొన్నది (Car Crash). ఆ కారులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణించిన కొత్త దంపతులతో సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు ( Burnt Alive). మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు ఒక చెట్టును వేగంగా ఢీకొన్నది. దీంతో ఆ కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ఒక మహిళ, ముగ్గురు మగవారు మంటలంటుకున్న కారు నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో వారు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శకటంతో సహా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒక మహిళతోసహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఆరేళ్ల కిందట పెళ్లైన కొత్త దంపతులు కూడా మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

