Watch: లక్షల విలువైన బంగారు హారాన్ని.. షాపులో చోరీ చేసిన మహిళ
ఆ జ్యుయలరీ షోరూమ్‌లోని సీసీటీవీలో ఇదంతా రికార్డైంది. అనంతరం దీనిని గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లక్నో: లక్షల విలువైన బంగారు హారాన్ని షాపు నుంచి మహిళ చోరీ చేసింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 17న నడి వయస్కురాలైన మహిళ ఒక జ్యుయలరీ షోరూమ్‌కు వచ్చింది. కళ్లకు నల్ల కళ్ల జోడు, ముఖానికి మాస్క్ ధరించింది. అక్కడ పలు గోల్డ్ నెక్లెస్‌లను ఆమె పరిశీలించింది. ఒక హారం, చెవి రింగులు ఉన్న బాక్స్‌పై మరో హారం ఉన్న బాక్సును ఉంచింది. మెల్లగా కింద ఉన్న బంగారు హారం బాక్సును చీర చెంగులో దాచింది. పైన ఉన్న బాక్స్‌ను సేల్స్ వ్యక్తికి ఇచ్చింది. మరో చోట ఉన్న హారాలను చూస్తానంటూ అక్కడి నుంచి లేచి వెళ్లింది. అయితే ఆ మహిళ ఏమీ కొనకుండానే ఆ షాపు నుంచి వెళ్లిపోయింది.
కాగా, ఆ జ్యుయలరీ షోరూమ్‌లోని సీసీటీవీలో ఇదంతా రికార్డైంది. అనంతరం దీనిని గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గోల్డ్ నెక్లెస్‌ను చోరీ చేసిన మహిళ తన కళ్లకు నల్ల కళ్లద్దాలు, ముఖానికి మాస్క్ ధరించింది. దీంతో ఆమెను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral Video | UP Woman's Robbery Caught On Camera, Steals Necklace Worth Lakhs
.
.
.#Viralvideo #UPviral #womanstealnecklace #Viralroberry pic.twitter.com/7BCl2ns9Z9— Mirror Now (@MirrorNow) November 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

