న్యూఢిల్లీ : బాలీవుడ్ సాంగ్‌కు న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్ వద్ద మహిళ డ్యాన్స్ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎంతో బిజీగా ఉండే టైమ్స్‌స్క్వేర్ వద్ద ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేస్తుండగా పలువురు అదే దారిలో వెళుతుండటం కనిపిస్తుంది. అయితే ఇద్దరు మహిళలు అక్కడ ఆగి మహిళ డ్యాన్స్‌ను వీక్షించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. సమద్య్న అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 20 లక్షలు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో సమద్య్న లగాన్‌లోని రాధా కైసే న జాలే సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఇద్దరు మహిళలు ఆగి ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ పూర్తయ్యే వరకూ అక్కడే ఉండి వీక్షిస్తారు.
ఇద్దరు మహిళలు తన డ్యాన్స్ ఆసాంతం చూసి ప్రశంసలు గుప్పించడం మరువలేని అనుభూతిని మిగిల్చిందని, వారు అక్కడే ఉన్నా తాను ఎంతో కాన్ఫిడెన్స్‌తో పెర్ఫామెన్స్ పూర్తి చేశానని సమద్య్న రాసుకొచ్చారు. ఇక పలువురు నెటిజన్లు ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ను ప్రశంసించగా బిజీ రోడ్డును బ్లాక్ చేయడం సరైంది కాదని మరికొందరు యూజర్లు ఆమెను ఆక్షేపించారు.
Read More