న్యూఢిల్లీ : ట్రెడ్‌మిల్‌పై ఓ వ్యక్తి హాయ్ రామా సాంగ్‌కు తనదైన స్టెప్పులతో అదరగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలోక్ శర్మ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ట్రెడ్‌మిల్‌పై వివిధ పాటలకు అలోక్ డ్యాన్స్ వేస్తున్న వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంటాడు.
ఈసారి 1995లో దేశాన్ని ఊపేసిన రంగీలా ఫిల్మ్ నుంచి హాయ్ రామా సాంగ్‌కు అంతే జోష్‌తో అద్భుతమైన మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. అలోక్ పెర్ఫామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అతడి ఎక్స్ప్రెషన్స్ కూడా వావ్ అనిపించేలా ఉన్నాయని యూజర్లు ప్రశంసలు గుప్పించారు.
ఈ పోస్ట్‌కు హాయ్ రామా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 30,000కుపైగా వ్యూస్ లభించగా కామెంట్స్ సెక్షన్లో అలోక్ స్టైల్, డ్యాన్స్‌లో ఈజ్ బాగుందని నెటిజన్లు కితాబిచ్చారు. సూపర్ బ్రో అని ఓ యూజర్ వెన్నుతట్టగా లెజెండ్ అంటూ మరో యూజర్ ప్రశంసించాడు.