న్యూఢిల్లీ : నీళ్లలో చిన్నారులు ఆడుతుండటం కంటపడితే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఓ క్యూట్ బేబి రోడ్డుపక్కన ఉన్న నీళ్లలో గంతులేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుటెంజెబిడెన్ అనే ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 4 లక్షల మందికి పైగా వీక్షించారు.
Kids and puddles.. 😅 pic.twitter.com/HldmgiV8rz
— Buitengebieden (@buitengebieden) October 30, 2022
ఈ వీడియోలో చిన్న పాప పింక్ హుడీ జాకెట్, స్కర్ట్ ధరించి నీళ్లలో దూకుతుండటం కనిపిస్తుంది. నీటిలో ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన చిన్నారి పడిపోతుంది. కిందపడినా చిరునవ్వుతో పైకి లేచి ఆడుతుంటుంది. ఈ క్యూట్ వీడియో తమను కట్టిపడేసిందని పెద్దసంఖ్యలో యూజర్లు రాసుకొచ్చారు. చిన్నారి ఎనర్జీ లెవెల్స్, నీళ్లలో హ్యాపీగా ఆడుతుండటం ఆకట్టుకుందని కామెంట్స్ సెక్షన్లో పేర్కొన్నారు.