న్యూఢిల్లీ : నిద్రిస్తున్న కుక్కలను వేటాడేందుకు చిరుత ప్రయత్నించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషన్ పార్క్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ జాన్ ఫబియనో ఈ క్రేజీ వీడియోను క్యాప్చర్ చేశాడు. ఆరుబయట నిద్రిస్తున్న నాలుగు కుక్కలను వేటాడేందుకు వాటిని సమీపించేందుకు చిరుత వస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి.
నిద్రిస్తున్న కుక్కలపై కన్నేసిన చిరుత ఎలాంటి శబ్ధం చేయకుండా పొదల పక్క నుంచి వాటివైపు మెల్లిగా రావడం ఈ వీడియోలో చూడొచ్చు. కుక్కలను చిరుత సమీపించే సమయంలో ఒ కుక్కు తలెత్తి తమకు కొద్దిమీటర్ల దూరంలో ఉన్న చిరుతను పసిగడుతుంది. దీంతో ఒక్క ఉదుటున కుక్కలు చిరుతను తరిమేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఈ వైరల్ క్లిప్‌ను యూట్యూబ్ చానెల్ లేటెస్ట్ సైటింగ్స్ షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 2.8 కోట్ల మంది వీక్షించారు. కుక్కలు మేలుకుని రెప్పపాటులోనే చిరుతను తరిమేయడం అద్భుతమని ఓ యూజర్ కామెంట్ చేయగా, అది సింహం కాకపోవడంతో కుక్కలు బతికిపోయాయని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :