72 గంటల పాటు సమాధిలో స్వామీజీ : దుర్గా మాతను చూశానని వెల్లడి
72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు.
భోపాల్ : 72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు. బాబాను చూసేందుకు వచ్చిన భక్తులు సమాధి వద్ద ఆయనకు హారతి ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం తాను సమాధిలోకి వెళ్లానని పురుషోత్తమానంద్ అన్నారు.
72 గంటల పాటు సమాధిలో ఉన్నా తాను బలహీనపడలేదని చెప్పారు. సమాధిలో తన శరీరం మాత్రమే నేలపై ఉందని, తన ఆత్మ భగవంతుడిపై లగ్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. మరోసారి తాను 84 గంటల పాటు సమాధిలో ఉంటానని బాబా పురుషోత్తమానంద్ వెల్లడించారు.

సమాధిలోకి వెళ్లే ముందు తన తండ్రి పదిరోజుల పాటు ఆహారం ఏమీ తీసుకోలేదని కేవలం ద్రవాహారం తీసుకున్నారని బాబా కుమారుడు మిత్రేష్ కుమార్ వివరించారు. సమాధి కోసం బాబా నివాసం ఎదుట ఏడున్నర అడుగుల లోతున, నాలుగు అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవైన గొయ్యి తవ్వారు. కాగా బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ సమాధిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించినా ఆయన తాను అనుకున్న ప్రకారం సమాధి స్దితిని పూర్తిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- National news
- pit
- samadhi
- seer
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

