ఈ ఇద్దరు బ్యాడ్మింటన్‌లో తలపడితే గెలుపు ఎవరిదనుకుంటున్నారు..?
Dipika Padukone: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే బ్యాడ్మింటన్ క్రీడపై తన మక్కువను ప్రదర్శించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలిపెట్టలేదు. ఒకప్పటి ప్రపంచ నెంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే బిడ్డగా ఇప్పుడు కూడా

హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే బ్యాడ్మింటన్ క్రీడపై తన మక్కువను ప్రదర్శించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలిపెట్టలేదు. ఒకప్పటి ప్రపంచ నెంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే బిడ్డగా ఇప్పుడు కూడా అనుకోకుండానే బ్యాడ్మింటన్ క్రీడ ఆమె నిత్యజీవితంలో ప్రధాన భాగమైంది. భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు బయోపిక్‌లో నటిస్తున్న దీపికా పదుకొనే ఈ మధ్య రోజూ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నది.
తాజాగా షట్లర్ పీవీ సింధూతో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు, ఫొటోలను దీపికా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. వాటికి జస్ట్ ఎ రెగ్యులర్ డే ఇన్ మై లైఫ్… బర్నింగ్ కాలరీస్ విత్ @పీవీ సింధు అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. మొదటి ఫొటోలో పీవీ సింధూ మొబైల్లో ఇద్దరూ కలిసి ఏదో చూస్తున్నట్టుగా ఉన్నది. మిగతా ఫొటోల్లో బ్యాడ్మింటన్ కోర్టులో వాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలున్నాయి.
ఫొటోలతోపాటుగా దీపికా తను షటిల్‌కాక్‌ను బలంగా కొడుతున్న షార్ట్ యాక్షన్ వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్చేసింది. వీడియో చివరలో దీపికా పదుకొనే వర్సెస్ పీవీ సింధు అని ఇంగ్లిష్‌లో రాసింది. మరి ఆ ఫొటోలు, వీడియోలను మీరు కూడా ఒకసారి చూడండి.
దీపికా ఇన్‌స్టా పోస్టును చూస్తే నిజంగానే ఇద్దరూ తలపడితే ఎవరు గెలుస్తారనే చిలిపి ప్రశ్న మనలో మెదులుతుంది. మరి వాళ్లిద్దరూ బ్యాడ్మింటన్‌లో ఫేస్ టు ఫేస్ తలపడితే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

