న్యూఢిల్లీ: కరోనా టీకా తీసుకున్న ఆరు నెలలకు దాని వల్ల కలిగే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని డాక్టర్ ధేరేన్ గుప్తా తెలిపారు. పలు అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయని ఎస్జీఆర్హెచ్లో సీనియర్ కన్సల్టెంట్ అయిన ఆయన చెప్పారు. డెల్టా సోకినా రోగ లక్షణాలు లేని వ్యక్తులకు ప్రత్యేకంగా బూస్టర్ డోసులు అందించాలని అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడేందుకు ఎక్కువ అవకాశమున్న పిల్లలకు వెంటనే టీకాలు వేయాలని సూచించారు.