Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
Human Egg : మానవ అండాలు అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై ముంబైకి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. భారీగా నగదు, బ్యాంకు లాకర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు సహా కీలక ఆధారాల్ని అధికారులు సీజ్ చేశారు.
Human Egg : మానవ అండాలు అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై ముంబైకి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. భారీగా నగదు, బ్యాంకు లాకర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు సహా కీలక ఆధారాల్ని అధికారులు సీజ్ చేశారు. మంజూషా వాంఖెడేకు సంబంధించి లభ్యమైన ఆధారాలను బట్టి మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టును ఈడీ ముంబై జోనల్ ఆఫీస్ అధికారులు చేధించారు.
ఈ అక్రమ రవాణాలో మొత్తం 17 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీనిలో భాగంగా అక్టోబర్ 16 నుంచి పది వేర్వేరు చోట్ల సోదాలు నిర్వహించారు. థానే, నాసిక్, బరామతితోపాటు ఇతర చోట్ల దాడి చేశారు. థానేలోని బద్లాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)-2002 కింద ఈ కేసు నమోదైంది. పలు ఆస్పత్రులు, ఐవీఎఫ్ సెంటర్లలో సోదాలు జరిపారు. నిందితులు, వారి స్థావరాల నుంచి రూ.29 లక్షల నగదు, బ్యాంకు అకౌంట్లు, ఇతర డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాల్ని సీజ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. ఈ నెట్వర్క్ సభ్యులు పేద మహిళల్ని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. వారికి కొంత నగదు ఇచ్చి, వారి అండాలను సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఐవీఎఫ్ సెంటర్లు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) బ్యాంకులకు విక్రయిస్తున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. అలాగే, తప్పుడు ధృవపత్రాలతో డోనర్ల వివరాలు నమోదు చేస్తున్నారు. ఒకసారి డొనేట్ చేసిన మహిళల నుంచే వరుసగా అండాల్ని సేకరిస్తూ, వేరే పేర్లతో విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 40 మందికి పైగా మహిళల నుంచి ఇలా అండాల్ని సేకరించారు.
ఒక్కో సైకిల్‌కు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు మహిళలకు అందిస్తున్నారు. అలాగే, అండాలు విడుదలయ్యేందుకు వారికి హార్మోనల్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు బయటపడింది. దీంతో ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ED
- Human Egg
- Maharashtra
- Thane
RELATED ARTICLES
తాజా వార్తలు
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

