PLASTIC WASTE|
ఇండోర్: ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి సులభంగా, సమర్థంగా శుద్ధ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని ఐఐటీ-ఇండోర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. పాలిథెలీన్ టెరెఫెథలేట్ (పీఈటీ) ప్లాస్టిక్‌ను సింగిల్ యూజ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్‌లో ఎక్కువగా వాడతారు. మూడు సంవత్సరాలు పరిశోధించి, ఈ పీఈటీ వ్యర్థాల నుంచి శుద్ధ హైడ్రోజన్‌ను ఉత్పత్తిచేసే విధానాన్ని కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు. ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ప్లాస్టిక్ ముప్పుకు పరిష్కారం చూపడంతోపాటు, వ్యర్థాల నుంచి ఆదాయాన్ని ఆర్జించేందుకు తమ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. 2019-20లో దేశంలో సుమారు 34.7 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుబడినట్టు గత ఏడాది లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన విధానం ద్వారా 33 కిలోల పీఈటీ ప్లాస్టిక్ నుంచి ఒక కిలో ప్యూర్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఐఐటీ ఇండోర్ ప్రొఫెసర్ సంజయ్ కే సింగ్ తెలిపారు.