ముంబై: రిలయన్స్ ఫౌండేషన్ వ్యస్థాపక చైర్పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ(Nita Ambani)కి.. సీఎన్‌బీసీ-టీవీ18 అవార్డు దక్కింది. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డులను శనివారం ముంబైలో అందజేశారు. ఔట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు బ్రాండ్ ఇండియా అవార్డును నీతా అంబానీ గెలుచుకున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.
Memorable moments from last night! Reliance Foundation Founder Chairperson, Mrs. Nita M. Ambani, was honored for her “Outstanding Contribution to Brand India” at the CNBC-TV18 India Business Leader Awards 2024. pic.twitter.com/dogjW07Gsv
— Reliance Industries Limited (@RIL_Updates) December 8, 2024
నీతా అంబానీ ఓ విజినరీ వ్యక్తి అని, ఆమె దాతృత్వానికి ప్రతీక అని, కళాపోషకురాలు అని, లక్షలాది మందికి ఆమె దిక్సూచి లాంటి వ్యక్తి అని రిలయన్స్ సంస్థ తన ట్వీట్లో తెలిపింది. అన్ని అంశాల్లోనూ ఆమెకు నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు చెప్పింది. అనేక పాత్రలను ఆమె ఈజీగా పోషించగలదని వెల్లడించింది. అణగారిన వర్గాలకు విద్యను అందించడం.. సామాజిక స్పృహ కలిగి ఉన్న వ్యక్తి అని రిలయన్స్ సంస్థ పేర్కొన్నది.
Her visionary leadership in education, sports, healthcare, arts and culture, and women’s empowerment continues to put Brand India on the global map as an “unstoppable force not just economically, but also for its heart, its heritage, and its hopefulness.” pic.twitter.com/SwpCzrUdce
— Reliance Industries Limited (@RIL_Updates) December 8, 2024
భారతీయ కళలు, సంస్కృతికి ఆమె అనేక సేవలు చేశారు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ద్వారా ఆమె కళలకు ఓ ఫ్లాట్‌ఫాం క్రియేట్ చేసినట్లు అవార్డుల బృందం పేర్కొన్నది.