శ్రీనగర్: వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్(IAF Wing Commander)పై లైంగిక దాడి ఫిర్యాదు నమోదు అయ్యింది. వైమానిక దళానికే చెందిన మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆ కేసును ఫైల్ చేశారు. ఈ ఘటనలో శ్రీనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుద్గాం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. సంబంధిత చట్టాల ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తున్నట్లు వైమానిక దళం చెప్పింది. శ్రీనగర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్.. బుద్గాం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించినట్లు అధికారి చెప్పారు.