షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: గోవా సీఎం

పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇవాళ గోవా రెవల్యూషన్ డే. ఈ సందర్భంగా మార్గోవాలో ఉన్న అమరవీరుల స్మారకం వద్ద ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, సీఎం ప్రమోద్.. పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం ప్రమోద్.. మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సీఎం ప్రమోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన సారథ్యంలోనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆయన అన్నారు. కోవిడ్19 ఆంక్షలు ఉన్నా.. చాలా వరకు రాజకీయ పార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

