ముంబై, అక్టోబర్ 10: నేషనల్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన అధ్యక్షుడిని తానేనని అ పార్టీ రెబల్ నేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలతో విడిపోయి మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ తన పదవీ కాలం 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీకి తానే అధ్యక్షుడినని, మెజారిటీ వర్గం అంతా తన వెంటే ఉన్నారని స్పష్టం చేసిన ఆయన తాను షిండే ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకోవడాన్ని సమర్థించుకున్నారు.