Mallikarjun Kharge | ఇప్పుడు నాకు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం : మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్లు ఒక్కొక్కరిగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తాజాగా తోసిపుచ్చారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్లు ఒక్కొక్కరిగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత మల్లికార్జునఖర్గే సహా సీనియర్లు దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, హరీశ్ రావత్, కమల్‌నాథ్, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయొద్దని నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తాజాగా తోసిపుచ్చారు.
‘మీతో సహా సీనియర్ నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో ( Lok Sabha Polls) పోటీకి దూరంగా ఉంటున్నారుకదా..?’ అని ఖర్గేని మీడియా ప్రశ్నించింది. అందుకు ఖర్గే వయసు కారణంగా చెప్పారు. సీనియర్లు పోటీ నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తన వయసు ఇప్పుడు 83 ఏళ్లని, వయోభారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే, కార్యకర్తలు కనుక పోటీచేయాల్సిందేనని పట్టుబడితే మాత్రం చెయ్యక తప్పదని పేర్కొన్నారు.
‘ఇప్పుడు నా వయసు 83 ఏళ్లు. మీరు (మీడియా ప్రతినిధులను ఉద్దుశిస్తూ) 65 ఏళ్లకే రిటైర్ అవుతారు కదా.. అలాగే నేను 83 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం ’ అని ఖర్గే అన్నారు. ఒకవేళ ఈ సారి ఎన్నికల్లో బరిలో దిగితే సొంత నియోజకవర్గం గుల్బర్గా నుంచే పోటీ చేస్తారా..? అని మీడియా ప్రశ్నించగా.. అధిష్ఠానం ఆదేశిస్తే తప్పకుండా చేస్తా అని బదులిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తే మాత్రం బరిలోకి దిగక తప్పదు. కొన్నిసార్లు పార్టీని ముందుండి నడిపిస్తే, మరికొన్ని సార్లు వెనక ఉండి నడిపించాల్సి ఉంటుంది. తమకు అందిన జాబితాలో ఒకే స్థానం నుంచి పోటీకి పదేసిమంది రెడీగా ఉన్నారు’ అని ఖర్గే పేర్కొన్నారు.
కాగా, ఖర్గే 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో గుల్బర్గా నుంచి ఎంపీగా పోటీకి దిగి గెలిపొందిన విషయం తెలిసిందే. అయితే 2019లో జరిగిన ఎన్నకల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలను సంప్రదించిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై ఖర్గే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ప్రధాన నిందితుడు
Water Crisis | నెలకు ఐదు సార్లే స్నానం.. వంట వండుకోకుండా ఫుడ్ ఆర్డర్.. బెంగళూరు ప్రజల నీటి కష్టాలు
Hijack | హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్ నౌక హైజాక్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

