Viral Video | హైనాల పట్టుదల ముందు తలవంచిన మృగరాజు
బలవంతుడిదే రాజ్యమన్న ఆటవిక సూత్రాన్ని ఐకమత్యంతో తుత్తునియలు చేయవచ్చని హైనాల గ్యాంగ్ (Viral Video) తేటతెల్లం చేసింది. సింహం గుప్పిట్లో చిక్కి విలవిలలాడుతున్న హైనాను తోటి జంతువులు కాపాడుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
న్యూఢిల్లీ : బలవంతుడిదే రాజ్యమన్న ఆటవిక సూత్రాన్ని ఐకమత్యంతో తుత్తునియలు చేయవచ్చని హైనాల గ్యాంగ్ (Viral Video) తేటతెల్లం చేసింది. సింహం గుప్పిట్లో చిక్కి విలవిలలాడుతున్న హైనాను తోటి జంతువులు కాపాడుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని అరధుస సఫారీ లాడ్జిలో జరిగిన ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనను మ్యాడీ లోవె కెమెరాలో చిత్రీకరించారు.
ఆస్ట్రేలియాకు చెందిన మార్గట్, మ్యాడీ లోవె సఫారీని సందర్శించిన క్రమంలో ఈ ఘటనను రికార్డు చేశారు. ఈ వీడియోలో హైనాల గుంపు ఉన్న ప్రదేశానికి సింహం రావడంతో భయపడిన హైనాలు పారిపోగా ఓ హైనాను సింహం వెంటాడి చేజిక్కించుకుంటుంది. హైనాను నోటకరుచుకుని దాడి చేస్తుండగా మిగిలిన హైనాలు సింహం మీదకు ఉరికి హైనాను కాపాడేందుకు ప్రయత్నిస్తాయి.
పలుమార్లు ప్రయత్నించిన మీదట హైనాను సింహం విడిచిపెట్టడంతో హైనాల గుంపు వెనుదిరగడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల మందికి పైగా వీక్షించారు. హైనాను కాపాడుకునేందుకు హైనాల గుంపు ప్రదర్శించిన సమన్వయం, పోరాటపటిమపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :
Ashok Selvan | సహ నటిని పెళ్లి చేసుకున్న తమిళ హీరో.. ఫోటోలు వైరల్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Hyena
- Lion
- South Africa
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

