ఆగ్రా: ఎవరైనా భర్త తనను మంచి గా చూసుకోవడం లేదనో, హింసిస్తున్నాడనో ఫిర్యాదు చేస్తారు. కానీ ఆగ్రాకు చెందిన ఓ వివాహిత తన భర్త తనకు మోమోలు తెచ్చివ్వటం లేదని పోలీస్ కేసు పెట్టింది. మోమో అనేది మన సమోసాల్లాగా పాపులర్ స్నాక్. యూపీలోని మల్పూరకు చెందిన మహిళకు పినహట్కు చెందిన ఓ వ్యక్తితో ఇటీవల విహహం అయింది. పెండ్లి సయమంలో తనకు మోమోస్ అంటే ఇష్టమని వధువు చెప్పిందట. పెండ్లయ్యాక ఆమె భర్త క్రమం తప్పకుండా మోమోస్ తెచ్చేవాడని.. ఇటీవల అలా చేయటం లేదని ఆమె అలిగిందట.
ఈ విషయమై తరచూ వారిద్దరి మధ్య గొడవ జరిగేది. ఓ రోజు అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిందట. అక్కడి నుంచే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యాభర్తలను కౌన్సిలింగ్కు పంపించారు. కొన్నిసార్లు డ్యూటీ ఆలస్యం వల్ల మోమోలు దొరకలేదని, మరికొన్నిసార్లు మోమోస్ తీసుకోవటం మరిచిపోయానని భర్త తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇద్దరి మధ్య కౌన్సిలర్లు కుదిర్చిన రాజీ ప్రకారం భర్త వారానికి 2 రోజులు మోమోస్ తీసుకురావాలి. ఇందుకు అంగీకరించిన ఆ మహిళ భర్తతో కాపురానికి వెళ్లిందట.