ఢిల్లీ సిటీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పొగ దట్టంగా కమ్ముకుపోయింది. అయితే ఈ సమయంలో బస్సులో ఎవ్వరూ ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. మహిపాల్పూర్ అనే ప్రాంతంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 8 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు. దాదాపు గంట తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే.. వడ గాల్పుల కారణంగా బస్సు దగ్గరగా వున్న రెండు దుకాణాల్లోనూ మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు మంటలను ఆర్పేశారు. అయితే మంటలు ఎందుకు చెలరేగాయో తమకు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ఇక.. ఆనంద్ విహార్ ఐఎస్బీఈ నుంచి మెహరౌలీ అనే ప్రాంతం మధ్య తిరుగుతూ వుంటుంది.
Crazy fire in a DTC bus today. Reports @mukeshmukeshs pic.twitter.com/I6sz7E4F0j
— Sanket Upadhyay (@sanket) April 6, 2022