బ్లాక్ క్యాట్ కమాండోస్ ఎంపిక ఎలా..?
బ్లాక్ క్యాట్ కమాండోస్ | దేశంలోని వీఐపీల భద్రతకు బ్లాక్ క్యాట్ కమాండోస్‌ను కేటాయించడం మనందరికి తెలిసిందే. వీరంతా జాతీయ భద్రతా దళాలకు చెందిన

న్యూఢిల్లీ : దేశంలోని వీఐపీల భద్రతకు బ్లాక్ క్యాట్ కమాండోస్‌ను కేటాయించడం మనందరికి తెలిసిందే. వీరంతా జాతీయ భద్రతా దళాలకు చెందిన ప్రతినిధులు. ఎంతో ధైర్యవంతమైన ఈ సైనికుల ఎంపిక చాలా కఠినంగా జరుగుతోంది.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థను 1984లో ఏర్పాటు చేశారు. ఈ దళాలు దేశంలోని ప్రత్యేకమైన వ్యక్తులకు భద్రతను కల్పిస్తాయి. ఈ దళాల ఎంపిక డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో జరగదు. ఆర్మీ, పారామిలటరీ బలగాల నుంచి వీరిని ఎంపిక చేస్తారు. ఇండియన్ ఆర్మీ నుంచి 53 శాతం మంది సైనికులను, మిగతా 47 శాతం మంది సైనికులను సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్ బలగాల నుంచి ఎంపిక చేస్తారు.
ఈ ఎంపికైన సైనికులకు 90 రోజుల కఠినమైన శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఓ పరీక్ష నిర్వహించి, అందులో నెగ్గిన వారికి వారం రోజుల పాటు మరింత కఠినమైన శిక్షణను ఇస్తారు. ఈ శిక్షణలో 80 శాతం మంది సైనికులు ఫెయిల్ అవుతారు. కేవలం 20 శాతం మంది మాత్రమే తర్వాతి స్టేజ్‌కు ఎంపిక అవుతారు. చివరి రౌండ్ వచ్చే సరికి కేవలం 15 శాతం మంది సైనికులు మాత్రమే మిగులుతారు. సైకలాజికల్ టెస్టు కూడా నిర్వహిస్తారు.
ఎన్ఎస్జీ కమాండోస్ జీతాలు ఇలా..
ఎన్ఎస్జీ కమాండోస్ జీతాలు ఒక్కో సైనికుడికి నెలకు రూ. 84 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటాయి. ప్రతి నెల సగటున వారి జీతం రూ. 1.5 లక్షలు ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

