could be a Bajaj Pulsar rival
Honda | దేశంలోని టూ వీలర్స్ తయారీ కంపెనీల్లో రెండోస్థానంలో కొనసాగుతున్న హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) కొత్త స్పోర్టీ మోటారుసైకిల్ ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది. బజాజ్ పల్సర్‌తో పోటీ పడేందుకు బుధవారం (ఆగస్టు 2) కొత్త బైక్ ఆవిష్కరించనున్నది. 160-180సీసీ సెగ్మెంట్లో హోండా మోటార్ సైకిల్ రానున్నది.
బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించే మోటార్ సైకిల్ చంకీ మస్క్యులర్ ఫ్యుయల్ ట్యాంక్, ఫ్యుయల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్‌తో వస్తున్నది. స్పోర్టీ క్యారక్టర్ కలిగి ఉండే ఈ బైక్.. షార్ప్ లుకింగ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, కన్వెన్షనల్ బల్బులతోకూడిన టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. స్ల్పిట్ సీట్ సెటప్‌తో వస్తున్నది.
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)లో సక్సెస్ఫుల్ బైక్‌గా పేరొందిన యూనికార్న్ ఇంజిన్‌తో వస్తుందని తెలుస్తున్నది. 162సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ మోటార్ విభిన్నంగా ట్యూన్ అవుతుంది. యూనికార్న్ కంటే స్వల్పంగా అధిక విద్యుత్, టార్చి వెలువరిస్తుంది. బజాజ్ పల్సర్ 150, యమహా ఎఫ్‌జడ్-ఎఫ్ఐ, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్‌లతో పోటీ పడుతుంది.
160సీసీ సెగ్మెంట్లో హోండా యూనికార్న్ సేల్స్ మెరుగ్గా ఉన్నాయి. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఎక్స్ బ్లేడ్ బైక్ ఆవిష్కరించినా మోటారు సైకిళ్ల ప్రేమికులను ఆకర్షించలేకపోయింది. దీంతో 160సీసీ సెగ్మెంట్లో మరో బైక్ ఆవిష్కరించాలని నిర్ణయించింది హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్.