ఎన్నికల తర్వాత అందరి లెక్కలు సరిచేస్తాం.. పోలీసులను హెచ్చరించిన కమల్నాథ్
పోలీసు అధికారులంతా చెవులు విప్పి వినాలి. రాబోయే ఎన్నికల్లో అందరి ఖాతాలు సరిచేస్తాం’ అని కమల్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షాన పోలీసులు, అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండంపై ఆయన ఈ మేరకు హెచ్చరించారు.
భోపాల్: ఎన్నికల తర్వాత అందరి లెక్కలు సరిచేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆ రాష్ట్ర పోలీసులను హెచ్చరించారు. బహిరంగ ర్యాలీలో మాట్లాడిన ఆయన మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని గుర్తు చేశారు. ‘ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దూకుడు, భయాందోళనలకు గురికావద్దని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. పోలీసు అధికారులంతా చెవులు విప్పి వినాలి. రాబోయే ఎన్నికల్లో అందరి ఖాతాలు సరిచేస్తాం’ అని కమల్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షాన పోలీసులు, అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండంపై ఆయన ఈ మేరకు హెచ్చరించారు.
కాగా, కమల్నాథ్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ మండిపడింది. బెదిరింపు, ప్రతీకారం, ప్రతీకార రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని బీజేపీ నేత షెహజాద్ పూనావల్ల విమర్శించారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆ పార్టీ రాష్ట్రంలో పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా లేక ఖండిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

