సిమ్లా: దేశమంతా కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఎందుకంటే ఆ గ్రామస్తులు మిగతా గ్రామాల ప్రజల్లా ప్రభుత్వం లాక్డౌన్ విధించినా లెక్కచేయకుండా తిరగలేదు. పైగా ప్రభుత్వం ఆంక్షలు విధించడానికి ముందే తమకు తాము స్వతహాగా ఆంక్షలు విధించుకున్నారు.
మలానా గ్రామం మంచి పర్యాటక ప్రదేశంలో ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా పర్యాటకులు ఎవరినీ వారు తమ గ్రామంలోకి అనుమతించలేదు. గ్రామంలోకి వచ్చే రహదారులు అన్నింటిని మూసివేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Himachal Pradesh | People of Malana claim zero #COVID19 case in village due to self-imposed restrictions
— ANI (@ANI) May 20, 2021
"We've closed entry for tourists. We don't let them come to our village. There is no COVID case here. We're following self-imposed lockdown," says a local (19.05) pic.twitter.com/kzcdV4471R