Higher pension | అధిక పింఛన్ దరఖాస్తుకు రేపటితో ముగియనున్న గడువు
ఈపీఎఫ్‌వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.
హైదరాబాద్: ఈపీఎఫ్‌వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అధిక పింఛన్‌కు కోసం 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా అప్లయ్ చేసుకోనివారు ఈ రెండు రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. 2014 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు సర్వీసులో చేరి.. గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ ఆ మేరకు చందా చెల్లిస్తున్న ఉద్యోగుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఈపీఎఫ్‌వో స్వీకరిస్తున్నది.
కాగా, అధిక పెన్షన్ గడువు జూన్ 26తో ముగియాల్సి ఉన్నది. అయితే ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూలై 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతకు ముందు మార్చి 3 నుంచి మే 3 వరకు, ఆపై జూన్ 26 వరకు తుది గడువును పొడిగించుకుంటూ వచ్చింది. కాగా, వివిధ నిబంధనలపై స్పష్టత లేకపోవడం, ఈపీఎఫ్‌వో వివరణలు జాప్యంకావడం వంటి కారణాలతో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ నుంచి వచ్చే అధిక పెన్షన్ కోసం మెజారిటీ ఉద్యోగులు ఇంకా దరఖాస్తులు సమర్పించలేదు.
ఎవరు అర్హులు?
2014 సెప్టెంబర్ 1 కంటే ముందు నుంచే ఈపీఎఫ్, ఈపీఎస్‌లలో సభ్యులుగా కొనసాగుతున్నవారు అధిక పెన్షన్ పొందేందుకు అర్హులు. అలాగే 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు రిటైరైన ఉద్యోగులు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని ఈపీఎఫ్‌వో అధికారులు తిరస్కరించి ఉంటే వారు కూడా అర్హులే.
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO), వేతన పరిమితి కంటే ఎక్కువగా ఈపీఎఫ్ ఖాతాకు చెల్లించినట్లుగా రుజువు పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
పెన్షన్ అర్హత వేతనంపై ఈపీఎఫ్ఓ ఇలా క్లారిటీ
అధిక పెన్షన్ అర్హత గల ఉద్యోగుల పెన్షన్ అర్హత వేతనంపై వారం క్రితం ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం 2014 సెప్టెంబర్ కంటే ముందు రిటైరైన వ్యక్తికి చివరి 12 నెలల వేతన సగటును పెన్షన్ అర్హమైన వేతనంగానూ, తర్వాత రిటైరైతే ఐదేండ్ల వేతన సగటును ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది. ఇప్పుడు పెన్షన్ అర్హత వేతనం x సర్వీస్ కాలం / 70గా పెన్షన్ లెక్క గడుతున్నారు. గరిష్ట వేతన పరిమితి దాటి అధిక పెన్షన్‌కు అర్హత పొందే వారికి స్పెషల్ ఫార్ములా అమలు చేయాలన్న అభిప్రాయం కూడా ఉంది. అధిక పెన్షన్‌కు ఉమ్మడి ఆప్షన్ తీసుకున్నప్పుడే తాము నిర్ణయించే పెన్షన్ లెక్కింపు సూత్రానికి కట్టుబడి ఉండాలని ఈపీఎఫ్ఓ షరతు విధించింది. దాని ఆధారంగానే దరఖాస్తులు స్వీకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

