రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సొరేన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు.
అంతకుముందు హేమంత్ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో బీజేపీపై విరుచుకుపడ్డారు. “మనల్ని ఎవరూ విభజించ లేరు, తప్పు దోవ పట్టించలేరు. మన గొంతు నొక్కాలని వారు (బీజేపీ) ఎంతో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నానికి రెట్టింపుగా మన తిరుగుబాటు, స్వరం మరింత బలోపేతమైంది” అని చెప్పారు.