Kuno National Park | కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!
Kuno National Park | నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాలు నిర్దేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్తున్నాయి. కూనో నేషనల్ పార్క్ (Kuno National Park) నుంచి ఇటీవల ‘ఒబాన్’ (Oban) అనే చీతా తప్పించుకున్న విషయం తెలిసిందే. చీతాను అధికారులు వెతికి సురక్షితంగా తిరిగి పార్క్‌కు తీసుకొచ్చారు. ఇప్పుడు మరో చీతా నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లిపోయింది.
Kuno National Park | నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాలు నిర్దేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్తున్నాయి. కూనో నేషనల్ పార్క్ (Kuno National Park) నుంచి ఇటీవల ‘ఒబాన్’ (Oban) అనే చీతా తప్పించుకున్న విషయం తెలిసిందే. చీతాను అధికారులు వెతికి సురక్షితంగా తిరిగి పార్క్‌కు తీసుకొచ్చారు. ఇప్పుడు మరో చీతా నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లిపోయింది. ‘ఆశా’ (Asha) అనే చీతా కూనో నేషనల్ పార్కులోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వీర్పుర్ ప్రాంతంలోని బఫర్ జోన్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తప్పించుకున్న చీతా నదుల వెంబడి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. ఈ చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు.
మరోవైపు చిరుత తప్పించుకుని బఫర్‌జోన్‌లో సంచరిస్తుందని తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర
భయాందోళన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని
చెబుతున్నారు. చీతాలు జనావాసాల్లోకి రావని చెబుతున్నారు. మరోవైపు నిర్దేశిత ప్రాంతం దాటి చిరుతలు
బయటకు వెళ్తుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
మొదటి విడతలో 8 చీతాలు
దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs ) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన
విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడతలో గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని
నమీబియా (Namibia) నుంచి మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో నేషనల్ పార్కు (Kuno
National Park)కు వచ్చాయి. 8 చీతాల్లో.. ఇప్పటి వరకు నాలుగింటిని కూనో నేషనల్ పార్కు నుంచి ఫ్రీ
ఎన్క్లోజర్లలోకి విడిచిపెట్టారు. ఒబాన్, ఆశాను మార్చి 11న విడిచి పెట్టగా.. ఫ్రెడ్డీ, ఎల్టల్ను మార్చి 22న
విడిచిపెట్టారు. ఎనిమిది చీతాల్లోని నాషా అనే ఆడ చిరుత అనారోగ్యంతో గత నెలలో మృతి చెందింది.
రెండో విడతలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు..
ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చారు. వాటిలో
ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ నుంచి దాదాపు పది గంటల
ప్రయాణం చేసి గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చీతాలు చేరుకున్నాయి. ఆ తర్వాత భారత వాయుసేన
హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్క్‌కు వాటిని తరలించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్,
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, భూపేంద్ర యాదవ్ కునో జాతీయపార్కులో సిద్ధం చేసిన క్వారంటైన్ ఎన్క్లోజర్లలోకి చీతాలను విడిచిపెట్టారు.
Also Read..
Hanuman Jayanti | హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు.. కొండగట్టుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు
Ustaad Bhagat Singh | ఉస్తాద్ ఊచకోత షురూ.. రెగ్యులర్ షూటింగ్‌కి పవన్ కళ్యాణ్ రెడీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

