Meera Chopra | నా అక్క ప్రియాంక చోప్రా చెప్పింది నిజమే.. బాలీవుడ్లో వివక్షపై మీరా చోప్రా సంచలన వ్యాఖ్యలు
Meera Chopra | వరుస అపజయాలు, దక్షిణాది సినిమాల జోరుతో నిరాశలో ఉన్న బాలీవుడ్‌ను నెపొటిజం, బాయ్‌కాట్, కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలు కుదిపేస్తున్నాయి. ఒక్కో సందర్భంలో ఒక్కో అంశంలో హిందీ చిత్ర పరిశ్రమ విమర్శలు ఎదుర్కొంటున్నది.
Meera Chopra | వరుస అపజయాలు, దక్షిణాది సినిమాల జోరుతో నిరాశలో ఉన్న బాలీవుడ్‌ను నెపొటిజం, బాయ్‌కాట్, కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలు కుదిపేస్తున్నాయి. ఒక్కో సందర్భంలో ఒక్కో అంశంలో హిందీ చిత్ర పరిశ్రమ విమర్శలు ఎదుర్కొంటున్నది. బాలీవుడ్లో ఉండలేకే హాలీవుడ్ వెళ్లానని ప్రియాంక చోప్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇక్కడి వారసులు, ఔట్ సైడర్స్ అనే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హిందీ పరిశ్రమ గ్రూపు రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
కొందరు జట్టుగా ఏర్పడి తనను ఒంటరిదాన్ని చేశారని, అందుకే హాలీవుడ్‌కు వెళ్లానని ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలపై స్పందించింది ఆమె సోదరి మీరా చోప్రా. ఆమె మాట్లాడుతూ…‘వారసత్వం లేకుండా బయటి నుంచి వచ్చిన నటీనటులు స్టార్స్‌గా ఎంత పేరు తెచ్చుకున్నా…వివక్ష తప్పదు. చివరకు వారిని ఒంటరివాళ్లనే చేస్తారు. ఇక్కడి రూల్ బుక్ పాటించని ఆ తారలను అణగదొక్కేందుకు కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. హాలీవుడ్లో తన విజయాలతో మా సోదరి ప్రియాంక అలాంటి వారికి గుణపాఠం నేర్పింది’ అని పేర్కొంది. ‘బేవాచ్’ చిత్రంతో హాలీవుడ్లో అడుగుపెట్టింది ప్రియాంక చోప్రా. అక్కడ ‘రొమాంటిక్’, ‘ది వైట్ టైగర్’, ‘ది మాట్రిక్స్ రిసరెక్షన్స్’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

