Delhi Rain | ఢిల్లీలో కుండపోత వర్షం.. రెడ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ
Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తోపాటు దాని పరిసర ప్రాంతాలను (National Capital Region-NCR) శనివారం ఉదయం కూడా కుండపోత వర్షం ముంచెత్తింది. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా అనేక ప్రాంతాలు జలమయమవడంతో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి 'రెడ్ అలర్ట్ (Red Alert)' జారీ చేసింది.
Delhi Rain : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తోపాటు దాని పరిసర ప్రాంతాలను (National Capital Region-NCR) శనివారం ఉదయం కూడా కుండపోత వర్షం ముంచెత్తింది. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా అనేక ప్రాంతాలు జలమయమవడంతో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్ (Red Alert)’ జారీ చేసింది. వర్షాలవల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగడంతోపాటు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు పలు సూచనలు జారీచేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల విమాన సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు తమ విమాన ప్రయాణ స్థితిగతులను ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయం పట్టవచ్చని హెచ్చరించాయి.
అయితే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రస్తుతానికి సాధారణంగానే కొనసాగుతున్నాయని విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ స్పష్టం చేసింది. నగర పరిధిలోని కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్, గీతా కాలనీ, అక్బర్ రోడ్ వంటి ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నాట్ ప్లేస్‌లో మోటార్ల సాయంతో నీటిని తోడివేస్తున్నప్పటికీ, కొన్ని దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది.
గ్రేటర్ నోయిడా, నోయిడా ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల ప్రభావంతో ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అయితే ఆదివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, సెప్టెంబర్ 7 నుంచి కేవలం తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

