మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా.. అధికారి సస్పెండ్
కరోనా టీకా | మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా వేసినందుకు ఆరోగ్య శాఖ అధికారిని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ గత నె

బెంగళూరు: మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా వేసినందుకు ఆరోగ్య శాఖ అధికారిని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ గత నెల 2న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయన నిబంధనలకు విరుద్ధంగా తన స్వగృహంలో టీకా వేయించుకున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో పెద్దఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం మంత్రి ఇంటికి సిబ్బందిని తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించిన హిరెకెరూర్ తాలూకా హెల్త్ అధికారి ఆర్ మకందర్ను సస్పెండ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం కరోనా వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా దవాఖానలోనే ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ అనంతరం టీకా తీసుకున్నవారు అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. అయితే మంత్రి బీసీ పాటిల్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంట్లోనే టీకా తీసుకున్నారు. టీకా వేసిన అధికారిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం మంత్రిని మాత్రం వదిలేయడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
మట్టివాసన ఉన్న సినిమా ఇది!
ఈ నెలలో అన్ని రోజులూ టీకా
ఆర్ఆర్ఆర్.. అజయ్ దేవ్గన్ మోషన్ పోస్టర్ రిలీజ్
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

