Haryana law | ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం.. హర్యానా చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు
Haryana law Scrapped By Court | ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. (Haryana's 75% Quota In Private Sector) ఈ వివాదస్పద చట్టాన్ని రద్దు చేసింది.
చండీగఢ్: ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. (Haryana’s 75% Quota In Private Sector) ఈ వివాదస్పద చట్టాన్ని రద్దు చేసింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలకు 75 శాతం రిజర్వేషన్ను తప్పనిసరి చేస్తూ హర్యానా ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020ను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఈ చట్టానికి అనేక మార్పులు చేశారు. నెలవారీ జీతం రూ. 30,000 కంటే తక్కువ ఉండే ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయించాలని ఇందులో పేర్కొన్నారు. అలాగే దీని కోసం నివాస ధృవీకరణను 15 ఏళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించారు.
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్ చేయాలని హర్యానా ప్రభుత్వం భావిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

