మైడెన్ ఫార్మా దగ్గు మందు ఉత్పత్తి నిలిపివేత.. హర్యానా నిర్ణయం..!
maiden pharmaceuticals | మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్ డిపార్ట్మెంట్ సంయుక్త తనిఖీల్లో సిరప్‌లో 12 లోపాలు వెలుగులోకి వచ్చాయి. గాంబియాలో 66 మంది చిన్నారుల సిరప్ కారణంగా
చండీగఢ్ : మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్ డిపార్ట్మెంట్ సంయుక్త తనిఖీల్లో సిరప్‌లో 12 లోపాలు వెలుగులోకి వచ్చాయి. గాంబియాలో 66 మంది చిన్నారుల సిరప్ కారణంగా మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంయుక్త బృందం తనిఖీలు నిర్వహించారు. ఇందులో వెల్లడైన లోపాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం ఉత్పత్తినే నిలిపివేయాలని నిర్ణయించి, ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
సోనిపట్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న మూడు డ్రగ్స్ నమూనాలను కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కు పంపామని, ఇంకా నివేదికలు అందలేదన్న ఆయన.. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల రోజుల కిందట హర్యానాలో తయారైన నాలుగు దగ్గు సిరప్ ఉత్పత్తులపై హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో తీవ్రమైన కిడ్నీ గాయాల కారణంగా 66 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇందులో డై ఇథనీల్ గ్లైకాల్, ఇథలీన్ గ్లైకాల్ మందు మోతాదుకు మించి ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇది పూర్తిగా విషపూరితమని మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుందని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

